‘స్మార్ట్’ వేధింపులకు భయపడొద్దు.. ఒక్కఫోన్ కొట్టండి వారి సంగతి చూస్తాం: రాచకొండ పోలీసులు

by Javid Pasha |
‘స్మార్ట్’ వేధింపులకు భయపడొద్దు.. ఒక్కఫోన్ కొట్టండి వారి సంగతి చూస్తాం: రాచకొండ పోలీసులు
X

దిశ, రాచకొండ: ‘‘మనం రహస్యంగా దిగిన ఫోటోలు చాలా భద్రంగా ఉన్నాయి. ఇప్పుడా ఫొటోలను బయట పెట్టానంటే నీది, నీ కుటుంబం పరువు గంగలో కలుస్తుంది. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ కు ఆ ఫోటోలు పంపిస్తే.. గలీజ్ చూపులు, సూటిపోటీ మాటలతో నీ పని ఖతం. ఇవన్నీ జరుగొద్దు అంటే నేను పిలిచినప్పుడు వచ్చి నా కోరికలు తీర్చాలి. పైసల్ ఇవ్వాలి. లేదంటే నీ వీడియో సోషల్ మీడియాలో పెడుతా’’ అంటూ కొంతమంది యువకులు మహిళను, యువతులను వేధిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎవరికీ చెప్పుకోలేక, టార్చర్ రు తట్టుకోలేక ఎందరో యువతులు డిప్రెషన్ లోకి వెళ్లడమో లేక ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. అయితే ఇలాంటి యువతులకు అండగా నిలిచి, ఆకతాయిల ఆటకట్టించేందుకు రాచకొండ పోలీసులు చర్యలు చేపట్టారు.

స్మార్ట్ వేధింపులకు చెక్ పెట్టేందుకు కొత్తగా 8712662662 అనే హెల్ప్ లైన్ నెంబర్ ను తీసుకొచ్చారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఇప్పటికే 80 మంది యువతులను పోలీసులు కాపాడారు. వీడియోలు, ఫోటోలు, చాటింగ్ మెసేజ్ లు ఉన్నాయని భయపెట్టించే వారిబారిన పడ్డవారికి ఈ నెంబర్ ఆయుధం లాంటిది. బాధితులు ఈ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెబితే చాలు వేధించేవాడిని పట్టుకుంటారు. అతడి ఫోన్ తో ఇతర సాఫ్ట్ వేర్ పరికరాల్లో, సోషల్ మీడియా అకౌంట్ లలో దాచిపెట్టిన ఫైల్స్ ను అన్నింటిని డిలీట్ చేస్తారు. పోకిరీల ఫోన్లలో నుంచి బాధితులను భయపెట్టే ప్రతి డేటాను తొలగిస్తారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను జైలుకు పంపుతారు.

ఫస్ట్ కౌన్సిలింగ్.. వేగంగా యాక్షన్.. అనురాధ, సైబర్ క్రైమ్స్ డీసీపీ, రాచకొండ పోలీస్ కమిషనరేట్

8712662662 అనే హెల్ప్ లైన్ నెంబర్ 24/7 పని చేస్తుంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరస్థుల్లో చిక్కుకునే బాధితులు ఈ నెంబర్ కు ఫోన్ చేయండి. ముందుగా బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లలో మనోధైర్యాన్ని ఇస్తాం. వారి అనుమానాలను నివృత్తి చేసి భయాన్ని తొలగిస్తాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోకిరీల ఆటకట్టిస్తాం. వారి ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లలో నుంచి వీడియోలు, ఫోటోలు, చాటింగ్ డేటాను తొలగిస్తాం. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను జైలుకు పంపుతాం.

Advertisement

Next Story

Most Viewed