షార్ట్ సర్క్యూట్ తో వరికోత మిషన్ దగ్ధం..

by Kalyani |   ( Updated:2023-05-28 09:50:55.0  )
షార్ట్ సర్క్యూట్ తో వరికోత మిషన్ దగ్ధం..
X

దిశ, వీపనగండ్ల: షార్ట్ సర్క్యూట్ తో వరి కోత మిషన్ దగ్ధమైన ఘటన మండల పరిధిలోని గోపాల్ దిన్నె గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోచమోని శ్రీకాంత్ వరి కోత మిషన్ కొనుగోలు చేసి కిరాయికి వరి పొలాలను కోస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. ఎప్పటిలాగానే శనివారం సాయంకాలం గోపాల్ దిన్నె రిజర్వాయర్ సమీపంలో వరి పొలాలను కోస్తుండగా వరి కోత మిషన్ లో కొంత అవాంతరాలు ఏర్పడడంతో అక్కడే ఉంచి వెళ్లినట్లు బాధితుడు శ్రీకాంత్ తెలిపాడు. ఉదయం వచ్చేసరికి వరి కోత మిషన్ పూర్తిగా దగ్ధమై పొగలు వస్తున్నాయని వరి కోత మిషన్ లో షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగిందని బాధితుడు శ్రీకాంత్ తెలిపాడు. ఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై రామన్ గౌడ్ పరిశీలించారు,

Advertisement

Next Story

Most Viewed