సిగరెట్ తగాదాలో ఒకరి హత్య..మరో ఇద్దరికి గాయాలు..

by Anjali |
సిగరెట్ తగాదాలో ఒకరి హత్య..మరో ఇద్దరికి గాయాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరి మధ్య సిగరెట్‌ షేరింగ్ విషయంలో జరిగిన గొడవ చివరకు హత్యకు దారి తీసింది. ఈ ఘటన గురువారం బెంగళూరులోని ఉప్పర్‌పేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు కలబుర్గి జిల్లాకు చెందిన మల్లినాథ బిరాదార్ (36) గత కొన్ని నెలలుగా మెజెస్టిక్ సమీపంలోని ఒక హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, బుధవారం రాత్రి మల్లినాథ, గణేష్‌ అనే వ్యక్తి మధ్య సిగరెట్‌ తాగే విషయంలో గొడవ జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మంజునాథ్ అనే మరో సహోద్యోగి వారిద్దరి మధ్య గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ తీవ్ర ఆవేశానికి లోనైన గణేష్ కత్తితో మల్లినాథంను పొడిచాడు. గమనించిన స్థానికులు వెంటనే మల్లినాథ్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘర్షణలో గణేష్, మంజునాథ్‌లకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story