జూరాల ఎడమ కాలువలో ఒకరు మృతి, మరొకరు గల్లంతు

by Mahesh |
జూరాల ఎడమ కాలువలో ఒకరు మృతి, మరొకరు గల్లంతు
X

దిశ, గద్వాల/వనపర్తి: ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లోయర్ జూరాల ప్రాజెక్టులో ఏడిగా పనిచేస్తున్న రాజేందర్ ప్రసాద్ రెడ్డి (45) శనివారం తన కుటుంబ సభ్యులు ఎడమ కాలువలో ఈతకు వెళ్లారు. కుటుంబంలో చిన్నారికి ఈత నేర్పే సమయంలో కల్వలో కొట్టుకుపోతుండగా ఏడి రాజేంద్రప్రసాద్ రెడ్డి‌తో పాటు మరో వ్యక్తి చిన్నారి కోసం కాలువలోకి దూకారు. ముగ్గురు కాలువలో కొట్టుకుపోతున్న తరుణంలో చుట్టుపక్కల వారు గమనించి కాలువలోకి దూకి చిన్నారిని రక్షించారు. అప్పటికే రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మృతి చెందగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story