జాతీయ యువజన అవార్డు గ్రహీత విష్ణు సతీమణి మృతి

by Sridhar Babu |   ( Updated:2024-10-18 15:59:29.0  )
జాతీయ యువజన అవార్డు గ్రహీత విష్ణు సతీమణి మృతి
X

దిశ, రామడుగు : రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన యువజన సంఘాల సమితి జాతీయ అవార్డు గ్రహీత అలువాల విష్ణు సతీమణి రమ్యకృష్ణ మృతి చెందారు. ఆదివారం రాత్రి పెగడపల్లి మండలం మాక వెంకయ్య పల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విష్ణు దంపతులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే జీవనోపాధి కోసం పెగడపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ లో విష్ణు, రమ్యకృష్ణ దంపతులు లేడీస్ ఎంపోరియం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

దసరా పండుగకు తన స్వగ్రామమైన రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో సరదాగా పండుగ జరుపుకొని తిరిగి తన ద్విచక్ర వాహనంపై విష్ణు, రమ్యకృష్ణ ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి పెగడపల్లికి వెళ్తుండగా మ్యాక వెంకయ్య పల్లి స్టేజీ సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్​ ఢీకొట్టింది. దాంతో బైక్ పై నుండి ఇద్దరూ ఎగిరి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి.

దాంతో స్థానికులు వెంటనే కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. రమ్యకృష్ణ మెదడుకు బలమైన గాయాలు కావడంతో హైదరాబాద్​ తరలించారు. నాలుగు రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ రమ్యకృష్ణ గురువారం రాత్రి మృతి చెందారు. శుక్రవారం గోపాలరావుపేట గ్రామంలో రమ్యకృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story
null