భార్యను చంపి, ముక్కలుగా నరికేశాడు.. ఆ తర్వాత వాటర్ ట్యాంక్‌లో

by Mahesh |
భార్యను చంపి, ముక్కలుగా నరికేశాడు.. ఆ తర్వాత వాటర్ ట్యాంక్‌లో
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పూనమ్ వాలా తరహా మర్డర్ కేసు మరొకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను క్రూరంగా చంపేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి.. వాటిని వాటర్ ట్యాంక్ లో దాచిపెట్టాడు. ఈ ఘోర సంఘనట ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సవన్ ఠాకూర్ అనే వ్యక్తి తన భార్య తనకు నమ్మకద్రోహం చేస్తుంది. అని అనుమానంతో పవర్ ఠాకూర్ తన భార్యను కిరాతకంగా చంపేసి ఆమె శరీర భాగాలను ఇంటి వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు తన భార్యను ఒకటి, రెండు నెలల మధ్య చంపేసినట్లు తెలుస్తుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story