చేపల వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యం.. నాలుగు రోజుల తరువాత శవమై తేలిన వైనం

by Sridhar Babu |
చేపల వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యం.. నాలుగు రోజుల తరువాత శవమై తేలిన వైనం
X

దిశ, రాయపర్తి : మండలంలో ఓ యువకుడు చేపల వేటకు వెళ్లి నాలుగు రోజులకు శవమై నీటిపై తేలిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పిల్లి స్వరూప, సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమారులు రమాకాంత్, కృష్ణ కాంత్ ఉన్నారు. సత్యనారాయణ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. వీరిలో రెండవ కుమారుడు కృష్ణ కాంత్(29) ఈనెల 25వ తేదీన మధ్యాహ్నం తల్లి స్వరూపకు చేపల వేటకు వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు.

సాయంకాలం అయినా కొడుకు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి తోటి జాలరులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల నుండి కృష్ణకాంత్ జాడ కనిపించ లేదు. శుక్రవారం ఉదయం పూజారి సాగర్, కమటం ఎల్లస్వామి అనే ఇద్దరు వ్యక్తులు పొలం వైపు వెళ్తుండగా రిజర్వాయర్ కాలువలో మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై శ్రవణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Next Story

Most Viewed