రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...
X

దిశ, కథలాపూర్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పోతారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన నాగేల్లి రాజమల్లయ్య (55) దుంపేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజమల్లయ్య కోరుట్ల నుండి తన సొంత పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికుల సమాచారం. అయితే ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story