పాము కాటుతో వ్యక్తి మృతి...

by Kalyani |
పాము కాటుతో వ్యక్తి మృతి...
X

దిశ , కాప్రా: పాముకాటుతో ఓ వ్యక్తి మృతిచెందిన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోనియా గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న కంఠం మల్లేష్ (45) పాము కాటుకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వృత్తి రీత్యా వాచ్ మెన్ అయిన మల్లేష్ గత ఐదు నెలల నుంచి నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటికి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు.

రోజువారీగా విధులకు వెళ్లిన మల్లేష్ కు అదే ఇంట్లో పాము కాటు వేయడంతో ఈసీఐఎల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో గాంధీ హాస్పిటల్ కి తరలించారు, చికిత్స పొందుతూ మల్లేష్ మృతి చెందాడు. మృతుడు యాదాద్రి జిల్లా తుర్కపల్లి గ్రామానికి చెందినవాడు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story