డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి....!

by Kalyani |
డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి....!
X

దిశ,వనపర్తి టౌన్:: జిల్లా కేంద్రంలోని శ్రీ రామ థియేటర్ సమీపంలో ఉన్న డ్రైనేజీ కాల్వలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు పట్టణంలోని 20వ వార్డు కు చెందిన శీను (40 )సంవత్సరాలు కారు డ్రైవర్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు. చుట్టుపక్కల వారు డ్రైనేజీలో పడిపోయిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించారు. ఆ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు మున్సిపల్ అధికారులకు పోలీసు అధికారులు ఫోన్ చేస్తే... సరిగ్గా స్పందించలేదని, మున్సిపల్ అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో డ్రైనేజీలో మృతి చెందిన వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed