బంధువులను పరామర్శించడానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు

by Sumithra |
బంధువులను పరామర్శించడానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు
X

దిశ, శివ్వంపేట : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని దొంతి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం, నల్లవల్లి గ్రామానికి చెందిన సీతాల వెంకటేష్ (40) భార్య సుమలతతో కలిసి తన సొంత గ్రామం నుంచి తూప్రాన్ హాస్పిటల్ లో ఉన్న బంధువులను పరామర్శించడానికి బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తూప్రాన్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు దొంతి శివారులో బైకును ఢీకొనడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సుమలతకు స్వల్ప గాయాలయ్యాయి.



Next Story

Most Viewed