మిస్సింగ్ కేసులో విషాదం..

by Sumithra |
మిస్సింగ్ కేసులో విషాదం..
X

దిశ, రాజేంద్రనగర్ : భార్యతో గొడవపడి ఇంట్లో నుండి వెళ్లిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్ పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బుర్ర శ్రీనివాస్ (39) నాలుగు రోజుల క్రితం ఇంట్లో తనభార్యతో గొడవ పడి మనస్తాపానికి లోనై ఇంట్లో నుండి వెళ్లి పోయాడు. రాత్రి వరకు ఎదురు చూసిన కుటుంబ సభ్యులు రాజేంద్ర నగర్ పోలీసును ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బుర్ర శ్రీనివాస్ ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని స్నేహతులు, ఇతర చోట్ల గాలించినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల బుర్ర శ్రీనివాస్ ఆచూకీ చెబితే 10వేల నజరానా అందిస్తామని పోస్టర్లు అతికించారు.

మోటార్ సైకిల్ గుర్తించిన పోలీసులు : దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతికతను వినియోగించారు. శ్రీనివాస్ సెల్ ఫోన్ లొకేషన్ తోపాటు సీసీ కెమెరాల పరిశీలన చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలసులకు కిస్మత్ పూర్ మూసి వద్ద శ్రీనివాస్ ద్విచక్ర వాహనం కనిపించింది. అనుమానంతో మూసి నాలాలో గాలింపులు చెప్పట్టిన పోలీసులు ఉప్పర్ పల్లి మూసినాలా వద్ద శ్రీనివాస్ మృత దేహాన్ని గుర్తించారు. గత వారం రోజులుగా మూసీలో వరదప్రవాహం పెరగడంతో శ్రీనివాస్ మృత దేహం ఉప్పర్ పల్లి వరకు కొట్టుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నాలనుండి శ్రీనివాస్ మృత దేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఇన్స్ పెక్టర్ నాగరాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed