చెల్లి పెళ్లి నగలు తాకట్టు పెట్టి బెట్టింగ్.. మోసపోవడంతో వ్యక్తి సూసైడ్

by sudharani |
చెల్లి పెళ్లి నగలు తాకట్టు పెట్టి బెట్టింగ్.. మోసపోవడంతో వ్యక్తి సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో యువత బెట్టింగ్‌లకు అలవాటు పడి నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు అనే నెపంలో ఆన్‌లైన్ బెట్టింగ్ పెట్టి మోసపోతున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణలో జరిగింది. ఆన్‌లైన్ బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన అరవింద్ గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 3 నెలల క్రితమే వివాహమైంది. అయితే మే 5న తన చెల్లెలు వివాహముండగా పెళ్లికి తెచ్చిన బంగారం తాకట్టుపెట్టి రూ. 12 లక్షలు తెచ్చాడు. ఆ డబ్బు మొత్తం బెట్టింగ్‌లో పెట్టి మోసపోయాడు. దీంతో మనస్తాపం చెందిన అరవింద్ ‘అమ్మ నాన్న నన్ను క్షమించండి. నాకు చావే మార్గం’’ అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Next Story