- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్, కారు సీజ్
దిశ, ఎమ్మిగనూరు: కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మిగనూరు సెబ్ సీఐ. జయరాం నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ ఒ.సోమశేఖర్ రావు, తమ సెబ్ పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో టాటా మంజా నం. TS08 EV 4279 నంబరు గల ఒక కారులో మంత్రాలయం మండలం, రచ్చుమర్రి గ్రామానికి చెందిన పల్లెపాడు లక్ష్మయ్య, అదే గ్రామానికి చెందిన చెందిన కడితట్ల వీరేష్, ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన బోయ యువరాజుకు అక్రమ కర్ణాటక మద్యంను రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
వారి దగ్గరి నుండి పెద్ద మొత్తంలో 21 కర్ణాటక మద్యం బాక్సులలో 2016 (90ml ) ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ల కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం, టాటా మంజా నం. TS08 EV4279 నంబరు గల కారును స్వాధీనం చేసుకొని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో సెబ్ సీఐ.జయరాం నాయుడు తెలిపారు. మార్కెట్లో వీటి విలువ సుమారు ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ.ఓ.సోమశేఖర్ రావు, చంద్ర మోహన్ హెడ్ కానిస్టేబుల్స్ గోపాల్, లింగ ప్రసాద్, షరీఫ్, రభ్చాని , కానిస్టేబుల్స్ రామచంద్రుడు, నరసింహారెడ్డి, రాధమ్మ, అయ్యన్న, రామకృష్ణ పాల్గొన్నారు.