Gang-Rape: ఛీఛీ.. దేశ పరువు తీశారు కదరా.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం!

by Ramesh N |   ( Updated:2025-03-08 10:13:51.0  )
Gang-Rape: ఛీఛీ.. దేశ పరువు తీశారు కదరా.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం హంపి (Hampi) సమీపంలోని గంగావతి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల ఇజ్రాయెల్ టూరిస్ట్​ (Israeli tourist)తో పాటు హోమ్ స్టే (homestay host) యజమాని 29 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు (Gang-Raped) సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారితో పాటు వచ్చిన ముగ్గురు మగ పర్యాటకులపై దాడి చేసి నది కాలువలో తోసేశారు. అమెరికాకు చెందిన డేనియల్, మహారాష్ట్రకు చెందిన పంకజ్ అనే పర్యాటకుడు కాలువ నుంచి బయటపడగా, ఒడిశాకు చెందిన టూరిస్ట్ బిబాశ్ గల్లంతు అయ్యాడు. అతని కోసం గాలించిన పోలీసులు శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు.

ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. గురువారం సనాపూర్ నది కాలువ సమీపంలో ఈ ఘటన జరిగింది. నలుగురు పర్యాటకులు, ఒక హోమ్ స్టే యజమాని రాత్రి భోజనం తర్వాత సనాపూర్ కాలువ సమీపంలో తుంగభద్ర నది ఎడమ కాలువ వెంబడి నక్షత్రాలను చూడడానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడికి బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బంక్ గురించి అడిగారు. దగ్గరలో పెట్రోల్ బంక్ లేదని హోమ్ స్టే యజమాని చెప్పగా.. దుండగులు వారి నుంచి రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్యాటకులు వారికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో నిందితులు వారిపై దాడి చేశారు. అనంతరం నిందితులు ముగ్గురు టూరిస్టులను కొట్టి బలవంతంగా కాలువలోకి నెట్టారు. ఈ క్రమంలోనే మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి బైక్‌పై ఎక్కేఫ్ అయ్యారని తెలిపారు.

ప్రస్తుతం బాధిత మహిళలు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించారు. రెండు ప్రత్యేక టీమ్‌లు కేసును దర్యాప్తు చేపట్టాయి. అత్యాచారం జరిగిందని నిర్ధారించడానికి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఛీఛీ.. దేశ పరువు తీశారు కదరా.. అంటూ నిందితులపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Next Story

Most Viewed