రూ.10 వేల లోన్ కోసం ఇద్దరిని కాల్చి చంపారు

by Javid Pasha |   ( Updated:2023-06-18 11:56:13.0  )
రూ.10 వేల లోన్ కోసం ఇద్దరిని కాల్చి చంపారు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. లోన్ కట్టలేదనే కోపంతో ఇద్దరిని అతి కిరాతకంగా కాల్చి చంపారు. సౌత్ వెస్ట్ డీసీపీ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ఆర్కే పురం అంబేద్కర్ బస్తీకి చెందిన లలిత్ అనే వ్యక్తి ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లోన్ తీసుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కట్టలేకపోయాడు. అయితే లోన్ తిరిగి కట్టలేదనే కోపంతో లోన్ ఇచ్చిన వ్యక్తి దాదాపు 20 మందికి ఆయుధాలు ఇచ్చి లలిత్ ఇంటికి దాడికి పంపాడు. ఈ క్రమంలోనే ఆదివారం వేకువజామున 4 గంటలకు లలిత్ ఇంటికి వచ్చిన దుండగులు.. ఆయన ఇంటి తలుపును కొట్టారు. ఎంతకు తీయకపోవడంతో ఇంటిపై రాళ్లు విసిరారు.

ఈ క్రమంలోనే లలిత్ తన ఇద్దరు చెల్లెళ్లు పింకీ (30) జ్యోతి (29)లతో కలిసి బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో పింకీ, జ్యోతిలకు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దేవ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు బాధితుడు లలిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story