- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమంగా మొరం.. మోసెయ్..!
అడ్డగోలుగా భారీ టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు
దిశ, చౌటకూర్ : మండల పరిధలోని వివిధ గ్రామాల్లో మట్టి మాఫియా కొన్నళ్లుగా రాజ్యమేలుతోంది. పలు గ్రామాల నుంచి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. మట్టి మాఫియా వల్ల పంట పొలాలు సేద్యానికి పనికిరాకుండా పోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు వెంచర్లకు అక్రమంగా మట్టి రవాణా చేపడుతున్నారు. కట్టడి చేయవలసిన అధికారులు చోద్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
చుట్టుపక్కల మండల కేంద్రంలోని పలు గ్రామాల నుంచి అర్ధరాత్రి సమయంలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని అధికారులకు తెలియజేసిన ప్రయోజనం లేదని పలువురు వాపోతున్నారు. సంబంధిత అధికాకరులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో వ్యవహారం అంతా రహస్యంగా నడిపిస్తున్నారన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి మట్టి మాఫియాకు చెక్ పెట్టి ప్రభుత్వ సంపదను వృథా కాకుండా కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.