సూక్ష్మ దర్శిని సినిమా చూసి దారుణ హత్య.. కెమికల్స్‌లో నానబెట్టి బాడి డిస్పోస్

by Mahesh |
సూక్ష్మ దర్శిని సినిమా చూసి దారుణ హత్య.. కెమికల్స్‌లో నానబెట్టి బాడి డిస్పోస్
X

దిశ, వెబ్ డెస్క్: మీర్‌పేటలో భార్యను అతికిరాతంగా హత్యచేసి.. మృతదేహాన్ని కనిపించకూడా చేసిన కేసులు సంచలన విషయాలు(Sensational things) వెలుగులోకి వచ్చాయి. నింధితుడు గురుమూర్తి(Accused Gurumurthy) మహిళ మృతదేహాన్ని ముక్కలు చేసిన కుక్కర్ ఉడకబెట్టి చెరువులో పడవేశాడని వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడే పోలీసులకు ఊహించని క్లూస్ దొరకడంతో.. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన ఆధారాల తో పాటు మాధవి పిల్లలు, తల్లి నుంచి శాంపిల్స్ తీసుకున్న పోలీసులు ఈ హత్యను నిర్ధారించేందుకు ఫారెన్సిక్ Forensic (డీఎన్ఏ) టెస్టులకు పంపారు.

ఈ క్రమంలో మాధవి హత్య కేసు(Madhavi murder case)లో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్లాన్ ప్రకారం భార్యను హత్య చేయాలనుకున్న గురుమూర్తి.. తమిళ సినిమా "సూక్ష్మ దర్శిని"(sookshmadarshini) చూసి.. ఆ సినిమాలో మాదిరిగానే భార్యను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. కెమికల్స్‌(Chemicals)లో నానబెట్టి కాల్చి మృతదేహాన్ని పొడిగా మార్చి.. పొడిని చెరువులో చల్లినట్లు తెలుస్తుంది. అయితే బ్లూ రేస్ టెక్నాలజీతో క్లూస్ టీం(Clues Team) ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ మరికాసేపట్లో పోలీసులు చేతుల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం లోపు మిస్సింగ్ కేసును, హత్య కేసుగా మార్చి.. గురుమూర్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Next Story

Most Viewed