- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Formula E Race Case: సీఈఓను విచారించిన ఏసీబీ

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో( ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్) ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓను శనివారం ఏసీబీ విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 8 గంటలపాటు ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఈ రేస్ నిర్వహణపై కీలక అంశాలను సీఈఓ వెల్లడించారు. గత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే ఈ రేస్ నిర్వహణకు ఒప్పుకున్నట్టు ఎఫ్‌ఈఓ సీఈఓ విచారణలో తెలిపినట్టు ఏసీబీ తెలిపింది.
ఎఫ్ఈఓ, సీఈఓ గతంలో నాలుగు వారాల సమయం కోరగా ఏసీబీ దానికి ఒప్పుకున్నారు. నాలుగు వారాల సమయం పూర్తవ్వడంతో ఏసీబీ తిరిగి ఎఫ్ఈఓ సీఈఓను విచారించింది. దీంతో ఈ కేసులో ప్రాథమిక విచారణకు మార్గం సుగమమైంది. కాగా, ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్, బీఎల్ ఎన్ రెడ్డి, ఎస్ నెక్ట్ జెన్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.