ఘోర రోడ్డు ప్రమాదం…యువకుడు మృతి

by Kalyani |
ఘోర రోడ్డు ప్రమాదం…యువకుడు మృతి
X

దిశ, వరంగల్ : వరంగల్ హంటర్ రోడ్ సంతోష్ మాత దేవస్థానం సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా ఏసీ మూలమలుపు తిరుగుతుండగా వెనక నుండి అతివేగంతో డ్యూక్ బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు టాటా ఏసీ కి ఢీకొని పక్క రోడ్డుపై పడగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వారిపై నుంచి వెళ్ళింది. సంఘటన స్థలంలోనే ఉమేష్(18) అనే యువకుడు మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, బాటసారులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడు పడిగా ఉమేష్ (18) ఏఎస్ఎం కాలేజ్ వద్ద అభిరుచి హోటల్ యజమాని పడిగా శ్రీనివాస్ చిన్న కుమారుడిగా, తీవ్రంగా గాయపడిన మరో యువకుడు శంభునిపేట, బుడగ జంగాల కాలనీకి చెందిన పస్తం శివ గా గుర్తింపు.

Advertisement

Next Story

Most Viewed