- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోర రోడ్డు ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ..

దిశ,కామారెడ్డి : వెనక నుంచి వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ 1 డిపోకు చెందిన టీఎస్ 16 జడ్ 0178 నెంబరు గల ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు నిజామాబాద్ నుంచి కామారెడ్డి కి 15 మంది ప్రయాణికులతో వస్తుంది. టేక్రియాల్ బైపాస్ బ్రిడ్జి కింద రోడ్డు పనులు జరుగుతుండటంతో బైపాస్ బ్రిడ్జి నుంచి బస్సు వచ్చి బ్రిడ్జి ఎండింగ్ వద్ద కామారెడ్డి వైపు యూటర్న్ తీసుకుంటుండగా నిజామాబాద్ నుంచే వస్తున్న లారీ బస్సును మధ్యభాగంలో బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు మధ్య భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ రాములుతో సహా బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నాలుగేళ్ల బాలుడు అర్జున్, స్వప్న, విఠల్, దీప్తి, వీరవ్వ, విజయ, ఉమారాణి, డ్రైవర్ రాములు ఉన్నారు. ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.