జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లారీ ఢీకొని ముగ్గురు మృతి

by Kalyani |
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లారీ ఢీకొని ముగ్గురు మృతి
X

దిశ,జనగామ: స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపురం గ్రామ సమీపంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై కారు లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న రెడ్ కలర్ కియా కారు.. లారీని వెనుక నుంచి ఢీకొన్న దాని స్థానికులు చెబుతున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు.



Next Story

Most Viewed