అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

by Sumithra |
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..
X

దిశ, కౌడిపల్లి : అప్పులు తీర్చే మార్గం లేక జీవితం పై విరక్తి చెంది మనోవేదనకు గురై రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కౌడిపల్లి మండలంలో జరిగింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెలమకన్న గ్రామానికి చెందిన కర్రోళ్ల వెంకట్ రాములు (46) వ్యవసాయం కోసం చేసిన అప్పులతో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ లో కొనుగోలు చేసిన ట్రాక్టర్ కిస్తీ డబ్బులు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో జీవితం పై విరక్తి చెంది బుధవారం రాత్రి తన పశువుల కొట్టంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే నర్సాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ]

అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. వెంకట్ రాములు మృతి విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పోస్టుమార్టం పూర్తి అయ్యేవరకు అక్కడే ఉండి వెలమకన్నకు వెళ్లాడు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. మృతదేహం పై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి వెంకట్ రాములుకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో ఆంజనేయులు గౌడ్ తో పాటు కౌడిపల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, యూత్ అధ్యక్షులు దన్ సింగ్, నాయకులు పాషా, ప్రకాష్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇకపోతే వెంకట్ రాములు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య శ్యామల తో పాటు కుమారుడు సుమంత్, పెళ్లయిన కూతురు ఉంది. మృతుని భార్య శ్యామల గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed