అప్పుల బాధతో పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్య

by Jakkula Mamatha |   ( Updated:2024-10-14 15:40:30.0  )
అప్పుల బాధతో పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్య
X

దిశ, మంత్రాలయం రూరల్/పెద్దకడబూరు: ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దకడబూరు మండల పరిధిలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంబలదిన్నెకు చెందిన గులెప్ప (33) సోమవారం జాలవాడి సచివాలయం సమీపంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శరీరమంతా మంటలు అంటుకోవడంతో తట్టుకోలేక ముళ్ల కంపలోకి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పి వేసి 108కు కాల్ చేసి అంబులెన్స్ కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

వివరాలు ఇలా ఉన్నాయి.. కంబలదిన్నె గ్రామంలో నివాసముంటున్న ఈరన్న, నాగమ్మ,దంపతుల కుమారుడు గులెప్పకు అదే గ్రామానికి చెందిన గోవిందమ్మ తో పెళ్లి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరి జీవితం సాఫీగా సాగింది. సొంత పొలం సాగు చేసినందుకు అప్పు ఎక్కువ కావడంతో హైదరాబాద్ సిమెంట్ పని కోసం వెళ్ళాడు.ఆయన అప్పు తీరలేదు. చేసినప్పుడు ఎలా తీర్చాలని బెంగతో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో బయటకు వెళ్లి వస్తానని చెప్పి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. దానిలో పంట సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటడంతో సరిగా వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోయింది.దీంతో పంట సాగు కోసం చేసిన(06) లక్షల అప్పు ఎలా తీర్చాలని బెంగతో ఐదు ఆరు రోజులుగా మనస్తాపానికి గురయ్యాడు. పెట్రోల్ పోసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య గోవిందమ్మ,ఇద్దరు కుమారులు,ఒక కూతురు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Next Story

Most Viewed