- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటి పన్ను చెల్లించాలని వినియోగదారులకు ఫేక్ కాల్స్..
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కొత్తరకం మోసానికి తెర లేపారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని గృహ వినియోగదారులకు ఫోన్ చేసి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. ఇంటి పన్ను పెండింగ్ ఉంది తొందరగా చెల్లించాలని లేదంటే ఇల్లు జప్తు చేస్తామంటూ బెదిరించి 8309285419 గల నంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకుంటున్నారు.
కొందరికి అనుమానం వచ్చి మున్సిపల్ కమిషనర్ జయంత్ కుమార్ ను ఆశ్రయించగా ఈ నెంబర్ తో తమ కార్యాలయ సిబ్బందికి గాని తమకు గాని ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో మోసపోయామని గమనించారు. ఇలా మున్సిపల్ పరిధిలోని ఆయా గృహ వినియోగదారుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 500 నుంచి వేల రూపాయలు దోచుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.