Big Alert:‘సంక్రాంతికి బంపర్ ఆఫర్.. ఉచిత రీఛార్జ్’ అని మెసేజ్ వచ్చిందా?

by Jakkula Mamatha |
Big Alert:‘సంక్రాంతికి బంపర్ ఆఫర్.. ఉచిత రీఛార్జ్’ అని మెసేజ్ వచ్చిందా?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ(sankranti Festival) వాతావరణం ఉట్టిపడుతోంది. అయితే సాధారణంగా పండుగల వేళ పెద్ద పెద్ద కంపెనీలు గానీ సంస్థలు గానీ ఆఫర్లు ప్రకటిస్తారనే విషయం తెలిసిందే. ఇక షాపింగ్ మాల్స్‌లో ఐతే భారీ డిస్కౌంట్‌లు ప్రకటిస్తారు. ఇక దీనిని అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతరనడంలో ఆశ్చర్యం లేదు. అసలు విషయంలోకి వెళితే.. సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) పండుగ సమయాన్ని తమ మోసాలకు కొత్త ఎత్తుగడగా ఎంచుకున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ‘పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్(bumper offer) అని ఉచిత రీఛార్జ్ అంటూ మెసేజ్‌లు పంపుతారు. వాటిని నమ్మకండి. ఆశపడి క్లిక్ చేయవద్దు. లింక్ మరో 10 మందికి షేర్ చేయండి.. అంటూ మెసేజ్ పెడతారు. అలా షేర్ చేస్తే ఫ్రీ రీఛార్జ్ వస్తాదని చెబుతారు. కానీ అది ఫేక్. ఆ లింక్‌ను ఎవరికి షేర్ చేయకండి. అది రీఛార్జ్ కాదు.. మాల్ వేర్. అత్యాశకు వెళ్లి సైబర్ మోసాలకు గురికావొద్దు’ అని ట్విట్టర్ వేదికగా పోలీసులు ప్రకటన చేశారు.

Next Story

Most Viewed