Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. భారీగా విదేశీ గంజాయి పట్టివేత

by Shiva |
Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. భారీగా విదేశీ గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలో తయారు అవుతోన్న, విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)లను కస్టమ్స్ అధికారులు (Customs officials), నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే విదేశాల నుంచి భారీగా గంజాయిని భారత్‌ (India)కు అక్రమంగా తీసుకొస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు (Customs Officials) ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బ్యాంకాక్ (Bangkok) దేశం నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు (Mobile Phones), పాస్‌పోర్టులు (Passports), అదేవిధంగా గంజాయి ఉన్న మొత్తం ఐదు ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఫారిన్ గంజాయి (Foreign Cannabis) విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.47 కోట్లకు విలువ ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed