- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి, నకిలీ సర్టిఫికెట్లు, నోట్లతో దందా.. నిందితుల అరెస్ట్..
దిశ, దుండిగల్: జల్సాల కోసం ఆర్థిక నేరాలకు అలవాటు పడ్డ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సూరారంలో జరిగింది. సోమవారం మేడ్చల్ డీసీపీ సందీప్ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సురారంలోని ఓ వీధిలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు ఈ నెల 7వ తేదీన సాయంత్రం 5.15 గంటలకు తనిఖీలు నిర్వహించారు.
సూరారం కు చెందిన మొదటి ముద్దాయి యు. బాబురావు(38) ఇచ్చిన సమాధానంపై అనుమానం రావడంతో పోలీస్ లు అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. బాబురావు 2015 లో సీపీయూ, ప్రింటర్ కొనుగోలు చేసి పలు యూనివర్సిటీలకు చెందిన దొంగ సర్టిఫికెట్లను ముద్రించి కూకట్పల్లికి చెందిన జూపల్లి నరేంద్ర (19), జూరుపాల శ్రీను (23)తో కలిసి అమాయకులను టార్గెట్ గా చేసుకొని విక్రయించేవారని అంతటి తో ఆగక పాత 100 రూపాయల నోట్లను యానిమేషన్ ద్వారా కలర్ జిరాక్స్ తో ప్రింట్ చేసి మార్కెట్ లో విక్రయించేవారని తెలిపారు.
ఇటీవల కృష్ణ జిల్లాకు చెందిన మురళి, అరుకుకు చెందిన జాన్ ద్వారా ఆంధ్ర నుంచి గంజాయు తెప్పించి విక్రయించడం మొదలు పెట్టినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు బాబురావు, నరేంద్ర, శ్రీను లను అరెస్ట్ చేశామని మరో ఇద్దరు నిందితులు మురళి, జాన్ లు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 34 వివిధ యూనివర్సీటీలకు చెందిన ఎడ్యుకేషనల్ నకిలీ సర్టిఫికెట్స్, రెండు హర్డ్ డిస్క్ లు, కలర్ ఫ్రింటర్, సీపీయూ, 3 మెబైల్స్, 500 గ్రాముల గంజాయి,111దొంగనోట్లు (100రుపాయలు కలర్ జిరాక్స్) లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు. సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన వారిని గుర్తించి కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకట్ రెడ్డి, దుండిగల్ సీఐ వై. రామకృష్ణ, ఎస్ఓటీ సీఐ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.