- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Crypto Currency: క్రిప్టో కరెన్సీ స్కామ్.. ఆ ఇద్దరు హీరోయిన్లను విచారించనున్న పోలీసులు

దిశ, వెబ్‌డెస్క్: క్రిప్టో కరెన్సీ (Crypto Currency)లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి పుద్దుచ్చేరి (Puducherry)లో ఓ కంపెనీ జనాలను నిలువునా ముంచేసింది. ఈ మేరకు 10 మంది నుంచి కంపెనీ నిర్వాహకులు దాదాపు రూ.2.40 కోట్లను వసూలు చేసి ఊడాయించారు. అయితే, బాధితుల్లో ఒకడైన అశోకన్ (Ashokan) అనే రిటైర్డ్ ఉద్యోగి జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించాడు. కాగా, క్రిప్టో కరెన్సీ కంపెనీ (Crypto Currency Company) 2022లో కోయంబత్తూరు ప్రాంతంలో హెడ్ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఆ కంపెనీ ఓపెనింగ్ సెర్మనీకి ప్రముఖ సినీనటి తమన్నా భాటియా (Tamannaah Bhatia)తో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
అదేవిధంగా మహాబలిపురం (Mahabalipuram)లోని ఓ స్టార్ హోటల్‌లో కంపెనీ నిర్వహించిన పార్టీకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) కూడా అటెండ్ అయ్యారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కార్యక్రమానికి హాజరయ్యారని, బాధితులు అంతా కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇదే కేసులో ఆర్ధిక నేరానికి పాల్పడ్డారంటూ నితీష్ జెయిన్ (Nitish Jain) (36), అరవింద్ కుమార్ (Arvind Kumar)(40)లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే నటిమణులు కాజల్ అగర్వాల్ (Kajal Agarwal)తో పాటు తమన్నా (Tamannaah)ను కూడా పోలీసులు విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయనున్నారు.