దారుణం.. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న భార్యాభర్తలు

by Sridhar Babu |
దారుణం.. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న భార్యాభర్తలు
X

దిశ, డోర్నకల్ : మండల పరిధిలోని హుణ్యతండాలో దారుణం జరిగింది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. భూక్య రాము, బుజ్జి దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణతో క్షణికావేశంలో పదునైన ఆయుధంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు చెబుతున్నారు. దాడిలో భార్య బుజ్జి(48) అక్కడికక్కడే మరణించింది. భర్త రాము కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed