Crime: అంపైర్‌ను కత్తితో దారుణంగా పొడిచి చంపిన యువకుడు

by Prasanna |
Crime: అంపైర్‌ను కత్తితో దారుణంగా  పొడిచి చంపిన యువకుడు
X

దిశ,వెబ్ డెస్క్: ఏంటో నిముష నిముషానికి ఎలాంటివి వినాలిసి వస్తుందో? ఎందుకంటే కత్తులతో పొడుచుకోవడం, చంపుకోవడం ఈ రోజుల్లో కామన్ ఐపోయింది. అంపైర్ నో బాల్ ఇచ్చినందుకు అతన్ని కొట్టి కత్తితో పొడిచి చంపేశారు.ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. ఒడిషాలోని చౌద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్హిసలంద గ్రామంలో శనివారం అండర్ 18 క్రికెట్ మ్యాచ్ జరిగింది.శంకర్‌పూర్‌, బెర్హంపూర్‌ గ్రామాలకు మధ్య మ్యాచ్ జరుగుతుండగా మహిలాంద ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల లక్కీ రౌత్‌ అంపైర్‌గా తప్పుగా చెప్పాడని కోపంతో లక్కీ రౌత్‌ను కొట్టాడు. అంతటితో ఆగకుండా ‘నో బాల్‌’ ఇచ్చినందుకు ఆ అంపైర్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరార్ అవుతుండగా ఇతర ఆటగాళ్లు అతడ్ని పట్టుకొని పోలీసుల స్టేషన్కు తీసుకెళ్లారు .ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed