ఆర్టీసీ బస్ ఢీ కొని కండక్టర్ మృతి..

by Sumithra |   ( Updated:2023-04-06 14:29:48.0  )
ఆర్టీసీ బస్ ఢీ కొని కండక్టర్ మృతి..
X

దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో వద్ద విధులు నిర్వహించుకుని భోజనానికి వెళ్తున్న ఆదిలాబాద్ డిపోకి చెందిన గంగారాం (54)ను అప్పుడే హైదరాబాద్ నుండి వచ్చి డిపోలోకి వెళ్తున్న సూపర్ లక్సరి బస్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గంగారాం ది ఆదిలాబాద్ జిల్లా బరంపుర్ గ్రామం కాగా మృతుడికి భార్య, కొడుకు, కూతుర్లు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు, మృతికి కారణం అయిన డ్రైవర్ వాసాల తిరుపతి పై కేసునమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed