ఎనిమిదేళ్లుగా సహజీవనం... ఆ తర్వాత సూసైడ్

by Anjali |   ( Updated:2023-03-25 08:56:44.0  )
ఎనిమిదేళ్లుగా సహజీవనం... ఆ తర్వాత సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాలోని బొట్టవనపర్తికి చెందిన పల్లవి(27) బంజారాహిల్స్‌లో నివాసం ఉంటుంది. కాగా, అదే ప్రాంతానికి చెందిన సదానంద్ అనే వ్యక్తి పల్లవితో పరిచయం ఏర్పరచుకొని ఎనిమిదేళ్లుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నాడు. పల్లవితో సహజీవనం చేసిన సయానంద్ మరో యువతిని పెళ్లి చేసుకోగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయిపనప్పటికీ అతడి వివాహం తర్వాత కూడా పల్లవి, సదానందం సహజీవనం కొనసాగించారు. కానీ కొద్ది రోజులుగా సదానంద్ ఏ కారణం లేకుండానే పల్లవిని చాలా ఇబ్బందులకు గురిచేశాడు. అంతేకాకుండా సదానంద్ ఇటీవలే పల్లవిపై దాడి కూడా చేశాడు. దీంతో పల్లవి ఆత్మహత్య చేసుకుంది.



Next Story