- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కిలో రూ.10 కొనడం రూ. 16 విక్రయం....రోజూ ఇదే తంతు
by Sridhar Babu |

X
దిశ, ఎల్కతుర్తి : మండలంలోని సూరారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సూరారం గ్రామ చర్చి పక్కన దాదాపు 31 క్వింటాల ప్రజా పంపిణీ బియ్యం బస్తాలు ఉన్నాయనే నమ్మదగిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ బస్తాల పక్కన భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన నర్రావుల ఆంజనేయులు ఉన్నాడు. పది రూపాయల కిలో చొప్పున పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి వాటిని తిరిగి కిలో 16 రూపాయలు చొప్పున కోళ్ల ఫారాలకు అమ్ముతున్నానని తెలిపారు. దీంతో ఆంజనేయులుపై ఎస్ఐ కేసు నమోదు చేశారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ విటల్, కానిస్టేబుల్ రాజు, హోంగార్డ్ వీరస్వామి పాల్గొన్నారు.
Next Story