కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య

by Gantepaka Srikanth |
కాంగ్రెస్ సీనియర్ నేత దారుణ హత్య
X

దిశ, నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య(69) దారుణ హత్యకు గురయ్యారు. ఆయనపై కొందరు గుర్తుతెలియని దుండగులు సోమవారం రాత్రి కిరాతకంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడివున్న ఆయన్ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. చక్రయ గౌడ్ మృతితో మిర్యాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చక్రయ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed