లివ్-ఇన్ పార్టనర్‌ దారుణ హత్య.. పరుపులో శరీరాన్ని నింపిన ప్రియుడు

by Mahesh |   ( Updated:2023-02-15 07:48:26.0  )
లివ్-ఇన్ పార్టనర్‌ దారుణ హత్య.. పరుపులో శరీరాన్ని నింపిన ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్: లివ్ ఇన్ పార్ట్‌నర్‌ని హత్య చేసి ఫ్రిజ్ లో కుక్కిన సంఘటన మరువక ముందే మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి.. తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌ని హత్య చేసి మృతదేహాన్ని పరుపులో నింపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వృత్తి రిత్యా నర్సు అయిన మేఘా(37) నిందితుడైన తన ప్రియునితో కలిసి కొంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంది.

వీరు ముంబైలోని తులిన్జ్ ప్రాంతంలోని తన అద్దె ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. కాగా మేఘా బాయ్ ఫ్రేండ్‌ ఎటువంటి జాబ్ చేయకపోవడంతో వీరిద్దమధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే నిందితుడు మేఘాను హత్య చేసి, ఆమే మృతదేహాన్ని మెట్రెస్‌లో నింపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే హత్య అనంతరం తన సోదరికి చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.

కాగా కొద్దిరోజులకు వారి అద్దే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో.. ఇంటి పక్కన ఉన్న వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా.. మహిళా మృతదేహం.. మెట్రిస్ పరుపులో కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని.. మధ్యప్రదేశ్ లోని నాగ్దా వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారని పోలీసు అధికారి తెలిపారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.

Advertisement

Next Story