- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో మరో పరువు హత్య కలకలం.. యువకుడిని కిరాతకంగా చంపిన యువతి తండ్రి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని దశరథ్(26) అనే యువకుడిని గోపాల్ అనే వ్యక్తి అతి దారుణ హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంచాడు. దశరథ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఐదు రోజుల తర్వాత అసలు విషయం తెలిసింది. గోపాల్‌ను గట్టిగా మందలించగా.. తానే చంపానని ఒప్పుకుని శనివారం పోలీస్ స్టేషన్(Police station)లో లొంగిపోయాడు. ఆదివారం ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోపాల్‌తో కలిసి స్పాట్‌కు వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సూర్యాపేట పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(30)కు సూర్యాపేట పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్ అనే వ్యక్తి చెల్లెలు భార్గవితో పరిచయం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. దీనిని తట్టుకోలేకపోయిన నవీన్.. సినిమా స్టైళ్లో ప్లాన్ వేసి.. కృష్ణను హతమార్చాడు. ఈ ఘటనను ఇంకా మరువకముందే సంగారెడ్డిలో ప్రేమ పేరుతో యువకుడ్ని దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది.