- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నా చెల్లెలను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు.. వాళ్లిద్దరు అలా కనిపించడమే కారణం..!
దిశ, వెబ్ డెస్క్: అన్నా చెల్లెలను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లా బామండా గ్రామంలో కళావతి అనే మహిళ తన భర్తతో కలిసి ఉంటోంది. అయితే ఉపాధి నిమిత్తం భర్త వేరే చోట ఉంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. ఈ క్రమంలోనే కళావతి ఒక్కతే నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా కళావతి ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. ఈ క్రమంలోనే కళావతి ఆ వ్యక్తితో తన పెరట్లోని మంచంపై కూర్చొని మాట్లాడుతోంది. అయితే ఇది గమనించిన కొందరు గ్రామస్థులు వారిద్దరిని పట్టుకొని అదే పెరట్లోని చెట్టుకు కట్టేశారు. భర్త లేనిది చూసి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారా అంటూ ఇద్దరినీ చితకబాదారు.
అయితే తమ మధ్య అలాంటి సంబంధం ఏం లేదని, ఆ వ్యక్తి తనకు సోదరుడు అని ఆ మహిళ ఎంత చెప్పినా గ్రామస్థులు వినిపించుకోలేదు. అయితే సమాచారం అందుకున్న బంధువులు అక్కడికి వచ్చి వారిద్దరిని కాపాడారు. వాళ్లిద్దరూ నిజంగానే వరుసకు అన్నాచెల్లెల్లు అని చెప్పారు. అనంతరం బాధితులు పిప్లోడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిందంతా చెప్పారు. కొంతమంది గ్రామస్థులు తమపై నిందలు మోపుతూ తీవ్రంగా కొట్టారని ఫిర్యాదు చేశారు. కాగా ఇదే విషయమై పోలీసులు బాధిత మహిళ భర్తను ఫోన్ లో సంప్రదించగా.. ఆ వచ్చిన వ్యక్తి తన భార్యకు సోదరుడు అవుతాడని క్లారిటీ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.