చెరకు తోటలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యం..

by Vinod kumar |
చెరకు తోటలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యం..
X

దిశ, తాడ్వాయి: అనుమానస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన తాడ్వాయి మండలంలో చోటుచేసుకుంది. కృష్ణాజి వాడి రెవెన్యూ శివారులో బ్రహ్మాజీ వాడి గ్రామం దర్గా రోడ్డు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుంకరి కాశీరాం.. చెరుకు తోటను ఫ్యాక్టరీ కి తరలించడానికి కూలీలు చెరుకు కొడుతుండగా.. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో దాదాపు 2 నెలల క్రితం చనిపోయి శరీర భాగాలు పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో డెడ్ బాడీని గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాడ్వాయి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చనిపోయిన వ్యక్తిని గుర్తించి వారి యొక్క బంధువులకు ఆచూకీ తెలిపారు.

కుటుంబ సభ్యులు ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రొంపల్లి సాయవ్వ ముదిరాజ్(42) భర్త సాయిలు అని తెలియజేస్తు డిసెంబర్ 24వ తేదీ నుంచి ఆచూకీ కనబడటం లేదని కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అన్నారు. ప్రస్తుతం బ్రహ్మజీ వాడి శివారు ప్రాంతంలో శవమై ఉన్నదని తెలిసిందని తెలియజేశారు. సంఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తాడ్వాయి ఎస్ఐ ఆంజనేయులు తెలియజేశారు. చెరుకు తోట యజమాని సుంకరి కాశీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story