- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం
by Kalyani |

X
దిశ,అల్లాదుర్గం : అనుమానస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన అల్లాదుర్గం మండలం లో చోటుచేసుకుంది. అల్లాదుర్గం మండలం కాయిదాం పల్లి గ్రామానికి చెందిన ఉసిరిగారి మల్లయ్య సీతానగర్ గ్రామ శివారులో శుక్రవారం అనుమానాస్పదంగా మల్లయ్య మృతదేహం స్థానికులకు కనిపించడంతో వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మల్లయ్య ది సాధారణ మృతి కాదని, అతడిని డబ్బుల కోసమే హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు తెలపడంతో అదే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతిపై అనుమానం తో క్లూ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మల్లయ్య మృతిపై పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.
Next Story