- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళపై హత్యాచారం చేసిన ఇద్దరు నిందితుల అరెస్ట్..
దిశ, సూర్యా పేట: ఒంటరిగా ఉంటున్న మహిళపై హత్యాచారం, హత్య చేసి బంగారు నగలు, నగదు తీసుకెళ్లిన నిందితులను అరెస్ట్ చేసి.. వారి వివరాలు వివరించిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. వివరాల్లొ్కి వెళితే.. 65 సంవత్సరాల వృద్ధురాలు నిమ్మల ఉమాదేవి చాలా సంవత్సరాల క్రితమే భర్తని వదిలి ఒంటరిగా నివసిస్తున్నదని. అదే గ్రామానికి చెందిన 25 సంవత్సరాల కప్పల విజయ్ సూర్యాపేట లోని బార్ లో వెయిటర్ గా పని చేస్తున్నాడు. మద్యం తాగి ఇతడు పెట్టే బాధలు భరించలేక ఆతని భార్య వెళ్ళిపోయిందని తెలిపారు. ఉమాదేవి గ్రామంలో ఒంటరిగా ఉండటం, ఆమె వద్ద బంగారం, డబ్బు ఉన్నదని గ్రహించి ఎన్నో రోజులుగా గమనించిన విజయ్, ఈ నెల 7వ తేదీన శుక్రవారం రోజు రాత్రి గ్రామంలో బలగం సినిమా ప్రదర్శిస్తుండటం, గ్రామస్తులందరు అక్కడ ఉండటం గమనించిన విజయ్ ఫుల్ గా మద్యం సేవించి అతని మిత్రుడు ఖలేoదర్ ను ఇంటి బయట ఉంచి, ఉమాదేవి ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న ఉమాదేవి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని తెలిపారు.
ప్రతిఘటించిన ఉమదేవిని విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె చనిపోయిoది. ఆ తర్వాత ఆమె సూట్ కేసు పగల గొట్టి సుమారు 6 తులాల బంగారు నగలు, 5 వేల రూపాయల డబ్బు దొంగిలించాడన్నారు. పోలీసు కుక్కలు పసిగట్టకుండా చనిపోయిన ఉమాదేవి పై కారం చల్లాడని పేర్కొన్నారు. ఇంటి బయట ఉన్న ఖలెందర్ కు డబ్బు కొంచమే దొరికిందని పొద్దున్నే ఇస్తాను వెళ్ళిపొమ్మని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరుసటి రోజు బంగారు నగలను కుదవబెట్టి ఒక లక్ష 40 వేల రూపాయలు తీసుకుని, కొత్త పల్సర్ బైక్, కొత్త బట్టలు కొని మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పోలీసుల విచారణ సంధర్బంగా ఆ రోజు రాత్రి ఉమాదేవి ఇంటి ప్రాంతంలో వీళ్ళు ఉండటం చూసి గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కప్పల విజయ్, ఖలందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్పీ తెలిపారు.