Arrest: ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్.. పోలీసుల అదుపులో నిందితులు

by Shiva |   ( Updated:12 March 2025 4:06 AM  )
Arrest: ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్.. పోలీసుల అదుపులో నిందితులు
X

దిశ, వెబ్‌డెస్క్: నకిరేకల్ (Nakirekal) ఎమ్మెల్యే వేముల వీరేశం‌ (MLA Vemula Veeresham)కు న్యూడ్ కాల్ (Nude Call) చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఆ సైబర్ నేరగాళ్లు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీసుల సహకారంతో నకిరేకల్ పోలీసులు ఇవాళ నిందితులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. సరిగ్గా వారం రోజుల క్రితం సైబర్ నేరగాళ్లు (Cyber ​​Criminals) ఎమ్మెల్యే వీరేశంకు న్యూడ్ కాల్ చేశారు. ఫోన్ ఎత్తిన కొద్ది క్షణాల్లోనే స్క్రీన్ రికార్డ్ (Screen Record) చేసిన దుండగులు.. అనంతరం ఆ వీడియో (Video)ను తిరిగి ఎమ్మెల్యే వీరేశంకు పంపారు. తాము అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే.. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు గురి చేశారు. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే న్యూడ్ వీడియో కాల్‌ ఘటనపై నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వచ్చిన కాల్ ఆధారంగా ప్రాంతాన్ని ట్రేస్ చేసి ఇవాళ ఉదయం నకిరేకల్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Read More..

కాశినాయనలో అన్నదాన సత్రం కూల్చివేత.. మంత్రి లోకేశ్ క్షమాపణలు

Advertisement
Next Story

Most Viewed