- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ Drugs ముఠా అరెస్ట్
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా జరగనుందనే సమాచారంతో నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్, నార్త్ జోన్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఖాదర్ మోహిద్దీన్, ఇబ్రహీం షాలు చెన్నై కేంద్రంగా డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నారని తెలిపారు. చెన్నై నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చి.. ఇక్కడి నుండి ఎవ్వరికీ అనుమానం రాకుండా విమానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు పంపించే వారని వెల్లడించారు.
నిందితులు గతంలో కూడా రూ.100 ల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల ను సరఫరా చేసినట్టు విచారణలో తేలిందని డీసీపీ చందనా దీప్తి తెలిపారు. వీరి వద్ద నుండి మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఎపిడ్రిన్ డ్రగ్ తో పాటు, 23 సిమ్ కార్డులు, 12 నకిలీ ఆధార్ కార్డులు, 06 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరి వెనక ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు.