గుర్తుతెలియని మృతదేహం లభ్యం

by Shiva |
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
X

దిశ, గంభీరావుపేట : గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన మండల పరిధిలోని మల్లారెడ్డిపేట గ్రామ సమీప మానేరు వాగు పెనమడుగు వద్ద చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుడు ఎరుపు రంగు లుంగీ, నీలం రంగు చెప్పులు ధరించినట్లుగా గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో సుమారు వారం రోజుల క్రితం మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. మృతుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 8712656375, 100 నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాల్సిందిగా గంభీరావుపేట ఎస్సై మహేష్ తెలిపారు.

Advertisement

Next Story