- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
11 నెలల బాబు అదృశ్యం.. ఇంకా లభించని ఆచూకీ
దిశ : ఏలూరు ప్రతినిధి: ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమామిడి సమీపంలో ఉన్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో 11 నెలల బాబు అదృశ్యం ఆందోళనకరంగా మారింది. ఇంట్లో నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా బాలుడి ఆచూకీ లభించకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనపై ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి 8 బృందాలుగా గాలిస్తున్నారు.
ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ఈ ఘటనపై విచారణ ముమ్మరం చేస్తామని మరికొద్ది గంటల్లోనే బాలుడు ఆచూకీ కనుక్కొని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగిస్తామని అంటున్నారు. బాలుడు ఆచూకీ లభ్యం కాకపోవడం పై ఆ గ్రామవాసులు తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగారు.