Accident: జూబ్లీ‌హిల్స్‌లో కారు బీభత్సం.. ఏకంగా ఆ హీరో ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టి..

by Shiva |   ( Updated:2025-03-14 05:59:36.0  )
Accident: జూబ్లీ‌హిల్స్‌లో కారు బీభత్సం.. ఏకంగా ఆ హీరో ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్/జూబ్లీహిల్స్: కారు బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని జూబ్లీహిల్స్ (Jubilee Hills)‎లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మదాపూర్ (Madhapur) నుంచి జూబ్లీ‌హిల్స్ (Jubilee Hills) రోడ్డు నెంబర్ 45 వైపు అతివేగంతో వెళ్తున్న (AP 39US0620) నెంబర్ గల తెలుపు రంగు స్విఫ్ట్ కారు రోడ్ నెంబర్ 1లోని నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ (Bala Krishna) ఇంటి ముందు భాగంలో ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అనంతరం బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‎ను ఢీకొట్టి అక్కడే నిలిచిపోయింది. ఈ దుర్ఘటనలో ఫెన్సింగ్‎తో పాటు కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. కారు ఒక్కాసారిగా ఫుట్‌పాత్‌పైకి దూసుకురావడంతో రోడ్డుపై ఉన్న జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే, ప్రమాదానికి కారణం కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని అక్కడున్న వారు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసును నమోదు చేసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.

Next Story