- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురి ప్రాణాలను కాపాడిన యువకుడు.. తిరిగిరాని లోకాలకు..
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం జరిగింది. విద్యుత్ షాక్ నుంచి తన సోదరుడు, అన్న పిల్లలు ఇద్దరినీ రక్షించబోయి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో మరో ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల తెలిపిన కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం బూడిదగడ్డ బస్తీకి చెందిన పెండ్యాల శరత్ (23) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. శరత్ కసిన్ బ్రదర్ రాజ్ కుమార్ తన సోదరుడు మధు పిల్లలు రిషి, శ్రీయన్ తో ఇంటి ముందు ఆటోలో కూర్చున్నాడు. అదే సమయంలో ఓ ఇసుక ట్రాక్టర్ లోడ్ తో అక్కడికి వచ్చింది. రోడ్డు చిన్నదిగా ఉండడంతో దారికడం ఉన్న ఆటోను రోడ్డు పక్కకు జరిపి నిలిపివేశారు.
ఆ తరువాత కాస్త ముందుకు వెళ్లిన ఇసుక ట్రాక్టర్ ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ తీగలు ఒక్కసారిగా ఆటో పై పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన శరత్ కర్రతో ఆటోవద్దకు చేరుకుని విద్యుత్ షాక్ గురైన ఇద్దరు పిల్లలు తన సోదరుడిని కాపాడాడు. ఈ ఘటన నుండి వారు క్షేమంగా బయటపడినప్పటికీ రాజ్ కుమార్ అనుకోకుండా ఆటోను తాకడంతో విద్యుత్ షాకు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే శరత్ ను బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. శరత్ ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శరత్ తల్లిదండ్రులకు ఒక్కగాను ఒక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నరుగా నిలపించారు. ఈ సంఘటనతో బూదిగడ్డబస్తిలో విషాదఛాయలు నెలకొన్నాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్ హాస్పిటల్ కి వెళ్లి శరత్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.