- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్రషర్ యంత్రంపై పడి యువకుడి మృతి
by Shiva |

X
దిశ, గుమ్మడిదల : క్రషర్ యంత్రంపై పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జిన్నారం మండలం మాదారం గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మాదారం గ్రామ పరిధిలోని రాక్ సాండ్ క్రషర్ లో ఒడిశా రాష్ట్రానికి చెందిన యుగేంధర్ సింగ్ (27) మిషన్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజు లాగే బుధవారం విధులకు హాజరైన యుగేంధర్ సింగ్ ప్రమాదవశాత్తు మిషన్ పై పడిపోవడంతో తలకు తీవ్ర గాయలయ్యాయి. గమనించిన తోటి కార్మికులు యుగేంధర్ సింగ్ ను ఆసుపత్రి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా కార్మికుల సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న రాక్ సాండ్ క్రషర్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు.
Next Story