రైలులో నుంచి పడి యువకుడి మృతి

by Shiva |
రైలులో నుంచి పడి యువకుడి మృతి
X

దిశ, కాగజ్ నగర్ : రైలులో నుంచి ఓ యువకుడు కింద పడిపోయి మృతిచెందిన ఘటన కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ తెలిపిన వివరాలు ప్రకారం.. గోరఖ్ పూర్ నుంచి యశ్వంత్ పూర్ వెళ్తున్న గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 11 గంటల ప్రాంతంలో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అదే రైలులో ఉన్న ఎం.అబ్దుల్లా (18) ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బీహార్ రాష్ట్రం కటిహర్ బాజీ పూర్ గ్రామానికి చెందిన ఎం.డీ అబ్దుల్లాగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బంధువుల వచ్చేంత వరకు సిర్పూర్ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరచినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story