స్కూటీపై రోడ్డు దాటుతున్న మహిళ.. దూసుకొచ్చిన లారీ (వీడియో)

by GSrikanth |   ( Updated:2022-09-29 05:59:48.0  )
స్కూటీపై రోడ్డు దాటుతున్న మహిళ.. దూసుకొచ్చిన లారీ (వీడియో)
X

దిశ, మేడ్చల్ టౌన్: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణానికి చెందిన ప్రియ(30) అనే మహిళ కండ్లకోయలోని రిలయన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఉదయం డ్యూటీకి స్కూటీ మీద బయలుదేరింది. మేడ్చల్ వివేకానంద విగ్రహం వద్ద రోడ్డు దాటుతున్న ఆమెను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ కిందపడ్డ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మురళీధర్ సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మురళీధర్ తెలిపారు.

వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://youtu.be/Lh_x0Slruo0

Advertisement

Next Story